‘ప్రజల జీవితాలతో ఆటలాడుకునే అధికారం ప్రభుత్వానికి లేదు’

ABN , First Publish Date - 2020-06-26T18:49:27+05:30 IST

ఇష్టారాజ్యంగా లక్షలాది ప్రజల జీవితాలతో ఆటలాడుకునే అధికారం

‘ప్రజల జీవితాలతో ఆటలాడుకునే అధికారం ప్రభుత్వానికి లేదు’

అమరావతి: ఇష్టారాజ్యంగా లక్షలాది ప్రజల జీవితాలతో ఆటలాడుకునే అధికారం వైపీసీ ప్రభుత్వానికి ఎవరూ ఇవ్వలేదని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బాధ్యతతో, అనుభవంతో చేయాల్సిన పనులను పిల్ల చేష్టల్లా పియర్స్ హైట్ పెంచుకుని ఎవరు కళ్లు కప్పుతారని ప్రశ్నించారు. సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇరిగేషన్ పవర్‌లో బెస్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టుగా, జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపు పొందిన పోలవరం ప్రాజెక్టును ఈ ప్రభుత్వం పండబెట్టిందని దేవినేని ఉమా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పైగా పొలవరం ప్రాజెక్టును పరిగెట్టిస్తామని ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. డ్యామ్‌ వద్ద కనీసం ఇంజనీరు కూడా లేరని ఆరోపించారు. ఇష్టారాజ్యంగా పొలవరం ప్రాజెక్టుతో ఆటలాడుకుంటున్నారని దేవినేని ఉమా ధ్వజమెత్తారు. ప్రాజెక్టు రాష్ట్ర ప్రజల భవిష్యత్తకు సంబంధించినదని అన్నారు.


గత ప్రభుత్వం హయాంలో పొలవరం ప్రాజెక్టులో జరిగిన పనులన్నీ ప్రతి నెల ప్రజలకు వివరించామని దేవినేని ఉమా అన్నారు. ప్రతి నెల చంద్రబాబు ప్రాజెక్టు వద్దకు వెళ్లి అక్కడ జరుగుతున్న పనులను మీడియా సమావేశంలో ఇంజనీర్లతో మాట్లాడించేవారని అన్నారు. మొత్తం 62 ప్రాజెక్టుల సమాచారం ఆన్‌లైన్‌లో పొందుపరిచామన్నారు. ఇవాళ ప్రాజెక్టుల సమాచారాన్ని ఎందుకు దాస్తున్నారని జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అసలు పోలవరం ప్రాజెక్టులో ఏం జరుగుతుందన్నారు.

Updated Date - 2020-06-26T18:49:27+05:30 IST