కరోనాపై కేబినెట్‌లో ఎందుకు చర్చించలేదు?: దేవినేని

ABN , First Publish Date - 2020-08-20T17:10:51+05:30 IST

రాష్ట్రంలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతున్నప్పటికీ నిన్నటి కేబినెట్ సమావేశంలో దానిపై చర్చ జరపకపోవడం పట్ల టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు.

కరోనాపై కేబినెట్‌లో ఎందుకు చర్చించలేదు?: దేవినేని

అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతున్నప్పటికీ నిన్నటి కేబినెట్ సమావేశంలో దానిపై చర్చ జరపకపోవడం పట్ల టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ...‘‘నిన్న 9782 కేసులు, 86 మరణాలు. కొంతమంది ప్రజాప్రతినిధులు పక్క రాష్ట్రాల్లో కార్పొరేట్ వైద్యం పొందుతున్నారు. సామాన్య, మధ్య తరగతి వారికి కూడా ఆ స్థాయిలో వైద్యం అందించాలి. 3,16,000 కేసులు, 3000 మరణాలతో కరోనా కల్లోలం సృష్టిస్తున్నా ఎందుకు నిన్న కేబినెట్‌లో చర్చించి ప్రజలకు భరోసాకల్పించ లేదు సీఎం జగన్’’ అంటూ దేవినేని ట్వీట్ చేశారు. Updated Date - 2020-08-20T17:10:51+05:30 IST