ప్రతిపక్షమంటే ఎందుకు భయం సీఎం జగన్ గారు: దేవినేని ట్వీట్

ABN , First Publish Date - 2020-06-25T18:21:22+05:30 IST

ప్రతిపక్షమంటే ఎందుకు భయం సీఎం జగన్ గారు: దేవినేని ట్వీట్

ప్రతిపక్షమంటే ఎందుకు భయం సీఎం జగన్ గారు: దేవినేని ట్వీట్

అమరావతి:  రాష్ట్రంలో టీడీపీ నేతల అక్రమ అరెస్ట్‌లపై ఆ పార్టీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మీ ప్రభుత్వ ఏడాది విధ్వంస పాలనకు సాక్ష్యంగా నేటికీ ప్రజావేదిక  శిధిలాలను అదే విధంగా ఉంచారు. అన్ని వ్యవస్థల్ని కుప్పకూల్చారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తూ అక్రమ కేసులు అరెస్టులు సాగిస్తున్నారు. ప్రభుత్వానికి ప్రతిపక్షమంటే ఎందుకు భయం చెప్పండి సీఎం జగన్ గారు?’’ అని ప్రశ్నిస్తూ దేవినేని ట్వీట్ చేశారు. Updated Date - 2020-06-25T18:21:22+05:30 IST