దేవాలయాల్లో దాడులపై సీఎం సమాధానం చెప్పాలి: దేవినేని

ABN , First Publish Date - 2020-09-17T17:56:15+05:30 IST

హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ మైలవరం షిరిడి సాయి దేవస్థానంలో టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ ప్రత్యేక పూజలు చేశారు.

దేవాలయాల్లో దాడులపై సీఎం సమాధానం చెప్పాలి: దేవినేని

కృష్ణా: హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ మైలవరం షిరిడి సాయి దేవస్థానంలో టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం మీడియా ముందుకు వచ్చి దేవాలయాల్లో దాడులపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.  నిందితులను పట్టుకోకుండా ప్రతిపక్ష పార్టీపై మంత్రులు ఎదురుదాడి చేయడం మానుకోవాలని ఆయన  హితవు పలికారు. వరసగా దేవాలయాలపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోందని మండిపడ్డారు.  రోజుకో సంఘటన జరగటం దారుణమన్నారు. ప్రభుత్వ అసమర్ధత, చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్వేది ఘటనపై సీఎం స్పందిస్తే ఇన్ని ఘటనలు జరిగేవి కావన్నారు. తక్షణమే నిందితులను పట్టుకొని హిందువుల మనోభావాలు కాపాడాలని దేవినేని ఉమ డిమాండ్ చేశారు. 


Updated Date - 2020-09-17T17:56:15+05:30 IST