బియ్యం మాఫియాపై ఏం చర్యలు తీసుకుంటున్నారు?: దేవినేని

ABN , First Publish Date - 2020-08-20T14:37:55+05:30 IST

లాక్‌డౌన్ సమయంలో కేంద్రం ఇచ్చిన రేషన్ బియ్యాన్ని మాఫియా నొక్కేసిందంటూ టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

బియ్యం మాఫియాపై ఏం చర్యలు తీసుకుంటున్నారు?: దేవినేని

అమరావతి: లాక్‌డౌన్ సమయంలో కేంద్రం ఇచ్చిన రేషన్ బియ్యాన్ని మాఫియా నొక్కేసిందంటూ టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘కేంద్రం పేదలకు ఇచ్చిన లాక్‌డౌన్ రేషన్ బియ్యం మాఫియా బొక్కేసింది. పాలిష్ చేసి ఎగుమతుల ద్వారా కోట్ల రూపాయల లాభం. కృష్ణపట్నం, కాకినాడ పోర్టుల ద్వారా విదేశాలకు ఎగుమతి. పట్టుబడిన వారిపై చర్యలు లేవు. రాష్ట్రంలో బియ్యం మాఫియాపై ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పండి’’ అంటూ దేవినేని ఉమ ట్వీట్ చేశారు.



Updated Date - 2020-08-20T14:37:55+05:30 IST