అలా చేసి ఉంటే రైతులకు ఈ దుస్థితి వచ్చేది కాదు: దేవినేని ట్వీట్

ABN , First Publish Date - 2020-04-26T14:47:10+05:30 IST

అలా చేసి ఉంటే రైతులకు ఈ దుస్థితి వచ్చేది కాదు: దేవినేని ట్వీట్

అలా చేసి ఉంటే రైతులకు ఈ దుస్థితి వచ్చేది కాదు: దేవినేని ట్వీట్

అమరావతి: అకాల వర్షంతో ఏపీలో చేతికి వచ్చిన పంటలు తడిసి ముద్దైపోయాయి. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల ఆవేదనకు... పంటల దుస్థితికి జగన్ ప్రభుత్వమే కారణమని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ప్రభుత్వం సకాలంలో రైతుల పంటల్ని కొనుగోలు చేసి ఉంటే నేడు రైతులకు ఈ దుస్థితి వచ్చేది కాదు కదా.. రూ.3 వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏమయ్యింది ముఖ్యమంత్రి గారు? మీ నిర్లక్ష్యానికి తడిసిన ధాన్యం, దెబ్బతిన్న మామిడి, మొక్కజొన్న, తీగజాతి  పంటలను వెంటనే మద్దతు ధరకు కొనుగోలు చేయాలి’’ అని దేవినేని ఉమ ట్వీట్ చేశారు. Updated Date - 2020-04-26T14:47:10+05:30 IST