యువశక్తికి అంతర్జాతీయ యువజనోత్సవ శుభాకాంక్షలు: చంద్రబాబు

ABN , First Publish Date - 2020-08-12T18:24:41+05:30 IST

అంతర్జాతీయ యువజనోత్సవం సందర్భంగా యువశక్తికి టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు

యువశక్తికి అంతర్జాతీయ యువజనోత్సవ శుభాకాంక్షలు: చంద్రబాబు

అమరావతి: అంతర్జాతీయ యువజనోత్సవం సందర్భంగా యువశక్తికి టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ యువత భవిష్యత్‌పై బాబు ఆందోళన వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ...‘‘దేశ భవిష్యత్తును నిర్దేశించే యువశక్తికి అంతర్జాతీయ యువజనోత్సవ శుభాకాంక్షలు. ఇటువంటి స్ఫూర్తిదాయక వేళ ఉన్నత ఉద్యోగాలను అందుకుని ఉజ్వల చరిత్రను లిఖించాల్సిన ఏపీ యువత... భవిష్యత్తుపై భరోసాలేని  రూ.5 వేల జీతంతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితుల్లో ఉండటం బాధాకరం. తెలుగుదేశం హయాంలో 2014-2019 మధ్య కాలంలో నవ్యాంధ్ర యువతకు 9,56,263 పారిశ్రామిక ఉద్యోగాలు వచ్చాయని ఈ ప్రభుత్వమే చెప్పింది. ఒక్క ఐటీలోనే 30,428 ఉద్యోగాలు ఇచ్చాం. ప్రభుత్వ ఉద్యోగాలు వేరే. నిరుద్యోగ భృతి, నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధి యూనిట్లు మరెన్నో అందించాం. కానీ ఇప్పుడు అవేవీ లేవు. ఇప్పటికైనా ప్రభుత్వం యువత నైపుణ్యాలకు, ప్రతిభాపాటవాలకు మెరుగులు దిద్ది... సమాజానికి, రాష్ట్రాభివృద్ధికి ఉపయోగపడేలా, పేరు తెచ్చేలా యువశక్తిని తీర్చిదిద్దాలి. ఎందుకంటే రానున్న కాలంలో యువ జనాభానే మన సమాజ సంపద కానుంది’’ అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.Updated Date - 2020-08-12T18:24:41+05:30 IST