దళిత విద్యార్థి మహేష్‌కి తక్షణమే న్యాయం చేయాలి: చంద్రబాబు
ABN , First Publish Date - 2020-08-12T17:58:10+05:30 IST
ఆంధ్ర విశ్వవిద్యాలయ దళిత విద్యార్ధి, రిసెర్చ్ స్కాలర్ ఆరేటి మహేష్ చేస్తున్న దీక్షకు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మద్దతు తెలిపారు.

అమరావతి: ఆంధ్ర విశ్వవిద్యాలయ దళిత విద్యార్ధి, రిసెర్చ్ స్కాలర్ ఆరేటి మహేష్ చేస్తున్న దీక్షకు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మద్దతు తెలిపారు. మహేష్‌కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ...‘‘రాజ్యాంగ నిర్మాత డా.బీ.ఆర్.అంబేద్కర్ భారత పౌరులకు ఇచ్చిన ప్రాథమిక హక్కులను ఏపీలో కాలరాస్తున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ దళిత విద్యార్ధి, రిసెర్చ్ స్కాలర్ ఆరేటి మహేష్ ఉన్నత చదువులకు ఆటంకాలు కల్పించడం విద్యాహక్కు చట్టాన్ని ఉల్లంఘించడమే. ఈ విధమైన కక్షసాధింపు గర్హనీయం. దళితుల చదువుకు అడ్డుపడటం ఫాక్షనిస్టుల దుష్ట సంస్కృతి. దళిత వైద్యులపై అమానుషాలు, దళిత జడ్జిపై రాళ్లదాడి, దళిత ఆడబిడ్డలపై అత్యాచారాలు, దళితుల భూములు బలవంతంగా లాక్కోవడం.. వంటి ఈ పాలకులగతి తప్పిన, మతిమాలిన చర్యలను దళిత సమాజమే నిగ్గదీయాలి. నిరాహార దీక్ష చేస్తున్న మహేష్‌కి తక్షణమే న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను’’ అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.