ఎంపీ విజయసాయి కరోనా బారిన పడటం బాధాకరం: బుద్దా వెంకన్న

ABN , First Publish Date - 2020-07-22T12:50:26+05:30 IST

ఎంపీ విజయసాయి కరోనా బారిన పడటం బాధాకరం: బుద్దా వెంకన్న

ఎంపీ విజయసాయి కరోనా బారిన పడటం బాధాకరం: బుద్దా వెంకన్న

అమరావతి: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవడంపై టీడీపీ నేత బుద్దా వెంకన్న ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘రాజకీయంగా ట్విట్టర్ ప్రత్యర్థులమే తప్ప వ్యక్తిగతంగా మా మధ్య ఎటువంటి గట్టు తగాదా లేదు. ఎంపీ విజయసాయిరెడ్డి గారు కనికరం లేని కరోనా బారిన పడటం బాధాకరం. ఆయన కరోనా నుండి త్వరగా కోలుకుని ట్విట్టర్‌లో యాక్టివ్ అవ్వాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను’’ అంటూ బుద్దా వెంకన్న ట్వీట్ చేశారు.Updated Date - 2020-07-22T12:50:26+05:30 IST