జగన్ తన కుమార్తెలను ఎందుకు పిలిపించారు?: బుద్దా వెంకన్న ట్వీట్

ABN , First Publish Date - 2020-03-18T18:39:01+05:30 IST

కరోనా వైరస్ నిరోధానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలను టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు.

జగన్ తన కుమార్తెలను ఎందుకు పిలిపించారు?: బుద్దా వెంకన్న ట్వీట్

విజయవాడ: కరోనా వైరస్ నిరోధానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలను టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. జగన్ సర్కార్‌కు సామాన్యులపై పట్టింపు లేదని.. కానీ తన కుమార్తెల ఆరోగ్యంపై శ్రద్ధ ఉందంటూ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. కరోనా పెద్ద విషయమే కాదన్న ఆయన.. లండన్ నుంచి తన కుమార్తెలను వెనక్కి పిలిపించుకోవడంలో అంతరార్థం ఏంటన్నారు. ‘‘పారాసెట్మాల్ వేస్తే కరోనా పారిపోతుందని, బ్లీచింగ్ పౌడర్ జల్లితే కరోనా చచ్చిపోతుందని సీఎం జగన్ అన్నారు. అసలు కరోనా పెద్ద విషయమే కాదన్న జగన్..  ఆయన ఇద్దరు కుమార్తెలను లండన్ నుంచి ఎందుకు వెనక్కి పిలిపించారు? అంటే ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోయినా పర్వాలేదు. రాష్ట్రంలో ఉన్న పిల్లలు కరోనా బారిన పడినా పర్వాలేదు. జగన్ కుటుంబం మాత్రం హాయిగా తాడేపల్లి కోటలో సురక్షితంగా ఉండాలి. జగరోనాకి ఇంత స్వార్ధమా? అంటూ ఘాటుగా ప్రశ్నించారు. Updated Date - 2020-03-18T18:39:01+05:30 IST