రాష్ట్రంలో కరోనా రోగుల పరిస్థితి ఘోరం: బోండా ఉమా

ABN , First Publish Date - 2020-07-27T19:18:52+05:30 IST

రాష్ట్రంలో కరోనా రోగుల పరిస్థితి ఘోరం: బోండా ఉమా

రాష్ట్రంలో కరోనా రోగుల పరిస్థితి ఘోరం: బోండా ఉమా

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి ఆళ్లనాని చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత బోండా ఉమ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంత్రి ఆళ్లనాని భాద్యత లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇవ్వాళ ప్రభుత్వం చేయవలసిన పనిని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. దేశంలో, రాష్టంలో ఏ విధంగా కరోనాని అదుపు చేయటానికి నిపుణలతో మాట్లాతున్నారని తెలిపారు. కరోనా సమయంలో ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం చేతగాక చేతులు ఎత్తేసిందని మండిపడ్డారు. కరోనా రోగుల పరిస్థితి రాష్టంలో ఘోరంగా ఉందన్నారు. దేశంలో అత్యధికంగా ఏపీలోనే కేసులు నమోదు అవుతున్నాయని అన్నారు. ప్రభుత్వ హాస్పిటల్‌లో మందులు, ఆక్సిజన్ కూడా లేక ప్రజలు ప్రాణాలు పోవడం నిజం కాదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం వైపల్యం వల్లే ఏపీలో కరోనా సమాజక వ్యాప్తిగా మారిందని బోండా ఉమా ఆరోపణలు గుప్పించారు. 

Updated Date - 2020-07-27T19:18:52+05:30 IST