విజయసాయిరెడ్డిపై మాజీ మంత్రి బండారు ఫైర్

ABN , First Publish Date - 2020-12-21T03:46:49+05:30 IST

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మండిపడ్డారు. మాజీ సీఎం చంద్రబాబుపై విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై..

విజయసాయిరెడ్డిపై మాజీ మంత్రి బండారు ఫైర్

విశాఖ: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మండిపడ్డారు. మాజీ సీఎం చంద్రబాబుపై విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయసాయిరెడ్డి వీసాకు విశాఖలో గడువుతీరిపోయిందని బండారు ఎద్దేవా చేశారు. చంద్రబాబుపై విజయసాయిరెడ్డి ఎన్ని చిందులు వేసినా వైసీపీ మాఫియాకు కొత్త డాన్‌గా మరో రెడ్డి నియామకం లాంఛనమేనన్నారు. విజయసాయిరెడ్డి సూట్‌ కేసు సర్దుకోవాలని బండారు సత్యనారాయణమూర్తి విమర్శించారు. 


Updated Date - 2020-12-21T03:46:49+05:30 IST