జగన్ రాయలసీమ బిడ్డో...కాదో తేల్చు సాయిరెడ్డి: అయ్యన్న ట్వీట్
ABN , First Publish Date - 2020-05-13T16:52:41+05:30 IST
జగన్ రాయలసీమ బిడ్డో...కాదో తేల్చు సాయిరెడ్డి: అయ్యన్న ట్వీట్
అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదంపై టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా కేసీఆర్, జగన్‌లపై ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ...‘‘సాయిరెడ్డి గారు మొన్నటి వరకూ కేసీఆర్-జగన్‌ది తండ్రి, కొడుకుల అనుబంధం అన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదాలు తొలగిపోయాయి అన్నారు. ఇరు రాష్ట్రాలు కలిసి ఉమ్మడి ప్రాజెక్టులు చేపడుతున్నాయ్ అంటూ కేసీఆర్ గారి చేతిని నాకిన జగన్ రెడ్డి గారు రాయలసీమ బిడ్డో..కాదో, అసలు జగన్ ఏపీకి చెందిన వ్యక్తో..కాదో నువ్వే తేల్చాలి సాయిరెడ్డి గారు. నాన్నకి కోపం వచ్చింది అని మెత్తబడతారా?...మెడలు వంచి నీళ్లు సాధిస్తారా?’’ అంటూ అయ్యన్నపాత్రుడు ట్వీట్ చేశారు.