జగన్ బీసీల ద్రోహి: అచ్చెన్నాయుడు

ABN , First Publish Date - 2020-03-03T03:42:32+05:30 IST

సీఎం జగన్‌పై టీడీపీ నేత అచ్చెన్నాయుడు మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లపై కోర్టు ఇచ్చిన తీర్పును ఉద్దేశించి ట్విట్టర్‌లో జగన్‌పై ..

జగన్ బీసీల ద్రోహి: అచ్చెన్నాయుడు

శ్రీకాకుళం: సీఎం జగన్‌పై టీడీపీ నేత అచ్చెన్నాయుడు మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లపై కోర్టు ఇచ్చిన తీర్పును ఉద్దేశించి ట్విట్టర్‌లో జగన్‌పై విరుచుకుపడ్డారు. ‘‘ఏరు దాటేవరకూ ఓడ మల్లన్న.. దాటాక బోడిమల్లన్న ఇదీ బీసీల పట్ల జగన్ సవతిప్రేమ. ఓట్లేసేవరకూ బీసీలకు నేనున్నాను, నేను విన్నానన్నాడు. గెలిచాక బీసీలపై వేటేస్తూ రిజర్వేషన్లపై రెడ్డి సంఘంతోనే కేసు వేయించిన జగన్‌రెడ్డి బీసీల ద్రోహి.’’ అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. 

Updated Date - 2020-03-03T03:42:32+05:30 IST