శ్రీనివాసరెడ్డి నివాసంలో ముగిసిన ఐటీ సోదాలు

ABN , First Publish Date - 2020-02-08T11:16:20+05:30 IST

టీడీపీ కడప జిల్లా అధ్యక్షుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు శుక్రవారం మధ్యాహ్నం ముగిశాయి.

శ్రీనివాసరెడ్డి నివాసంలో ముగిసిన ఐటీ సోదాలు

కడప, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): టీడీపీ కడప జిల్లా అధ్యక్షుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు శుక్రవారం మధ్యాహ్నం ముగిశాయి. కడప ద్వారకానగర్‌లోని శ్రీనివాసరెడ్డి నివాసంలో గురువారం ఉదయం 6గంటలకు ఐటీ అధికారుల బృందం సోదాలు ప్రారంభించింది. ఈ సమయంలో శ్రీనివాసరెడ్డి తల్లి హేమలతమ్మ ఒక్కరే ఇంట్లో ఉన్నారు. అలాగే హైదరాబాదులోని శ్రీనివాసరెడ్డి ఇంట్లో, కార్యాలయంలో కూడా సోదాలు జరిగాయి. గురువారం నుంచి ఐటీ అధికారులు కడపలోని ఇంట్లో అణువణువు వెదికి ఆంధ్రాబ్యాంకు లాకర్‌ కీ స్వాధీనం చేసుకున్నారు.  

Updated Date - 2020-02-08T11:16:20+05:30 IST