ప్రజల ప్రాణాల కన్నా రాజకీయాలే ముఖ్యమా?: దేవినేని ఉమ

ABN , First Publish Date - 2020-04-06T00:47:52+05:30 IST

వైసీపీ నేతలపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శలు గుప్పించారు

ప్రజల ప్రాణాల కన్నా రాజకీయాలే ముఖ్యమా?: దేవినేని ఉమ

గుంటూరు: వైసీపీ నేతలపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. వైసీపీ నేతలకు ప్రజల ప్రాణాల కన్నా రాజకీయాలే ముఖ్యమా? అని దేవినేని ఉమ ప్రశ్నించారు. డబ్బు పంచుతున్న వైసీపీ అభ్యర్ధులపై ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందో చెప్పాలన్నారు. ప్రపంచమంతా లాక్‌డౌన్ పాటిస్తుంటే వైసీపీ నేతలు సభలు, సమావేశాలు పెడుతున్నారని విమర్శించారు. ఐదు కోట్ల మందిలో మూడు వేల మందికే పరీక్షలు చేస్తారా? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడ్ టెక్ జోన్ మూసివేసి ఏం సాధించారు, ఇవాళ మెడ్ టెక్‌జోన్ దేశం మొత్తానికి వైద్య పరికరాలు అందిస్తోందని దేవినేని ఉమ అన్నారు. ఐసోలేషన్ వార్డులను కూడా ప్రారంభించడం వైసీపీ నేతల పిచ్చికి పరాకాష్ట అని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆక్వా రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని, రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు ఎప్పుడు ప్రారంభిస్తారని దేవినేని ఉమ ప్రశ్నించారు.

Updated Date - 2020-04-06T00:47:52+05:30 IST