రైతులకు జగన్ సమాధానం చెప్పాలి: దేవినేని ఉమ
ABN , First Publish Date - 2020-11-03T20:14:00+05:30 IST
రైతులకు జగన్ సమాధానం చెప్పాలి: దేవినేని ఉమ
అమరావతి: తాడేపల్లి రాజప్రసాదం నుండి ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడటంలేదు? అని మాజీ మంత్రి దేవినేని ఉమ ప్రశ్నించారు. చంద్రబాబు 70 శాతంపైగా పూర్తి చేసి రూ.55,548 కోట్ల అంచనాకు టీఏసీలో ఆమోదం తెచ్చారని తెలిపారు. 28 మంది ఎంపీలుండి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? అని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీ వెళ్లి పోలవరంపై ఎందుకు మాట్లాడటంలేదంటున్న రైతులకు జగన్ సమాధానం చెప్పాలన్నారు.