జగన్ తన పద్ధతి మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారు: మద్దిరాల న్యానీ
ABN , First Publish Date - 2020-09-07T17:20:10+05:30 IST
బైబిల్ పట్టుకుని జగన్ సీఎంగా ప్రమాణస్వీకరం చేయడంతో దళిత సోదరులు సంతోష పడ్డారని...
గుంటూరు: బైబిల్ పట్టుకుని జగన్ సీఎంగా ప్రమాణస్వీకరం చేయడంతో దళిత సోదరులు సంతోష పడ్డారని... కానీ పాలనలో మాత్రం దళితులపై నిత్యం వేధింపులు జరుగుతున్నాయని టీడీపీ క్రిస్టియన్ మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మద్దిరాల న్యానీ విమర్శించారు. ప్రజా వేదిక కూల్చివేతతో ప్రారంభమై నేటికి అరాచక పాలన సాగుతుందన్నారు. దళితులపై దాడులు నిత్యకృత్యంగా మారాయన్నారు. ప్రశ్నించిన దళిత నేతలపై అక్రమ కేసులతో భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ తన పద్ధతి మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని న్యానీ హెచ్చరించారు.