దళిత డాక్టర్‌పై దాడి ప్రతీకారమే : చంద్రబాబు

ABN , First Publish Date - 2020-05-18T10:16:10+05:30 IST

మాస్కులు అడిగిన దళిత డాక్టర్‌ సుధాకర్‌రావుపై ప్రభుత్వం అన్ని రకాల వేధింపులకు పాల్పడుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

దళిత డాక్టర్‌పై దాడి ప్రతీకారమే : చంద్రబాబు

అమరావతి, మే 17(ఆంధ్రజ్యోతి): మాస్కులు అడిగిన దళిత డాక్టర్‌ సుధాకర్‌రావుపై ప్రభుత్వం అన్ని రకాల వేధింపులకు పాల్పడుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. లాఠీ ఉపయోగించకుండా అదుపులోకి తీసుకోగలి గే పరిస్థితి ఉన్నా, చేతులు కట్టేసి జంతువులా వ్యవహరించడం ప్రతీకారం తప్ప మరొకటి కాదన్నారు. ఒక దళిత వైద్యుడిపై దాడి పౌరసమాజానికి మచ్చగా పేర్కొన్నారు. ప్రభుత్వ దుర్మార్గ చర్యలను ఖండిస్తున్నానని చంద్రబాబు ఆదివారం ట్వీట్‌ చేశారు. విజయవాడ పటమటలో ఉంటున్న వలస కూలీలపై పోలీసులు లాఠీచార్జ్‌ చేయడాన్నీ చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. జగన్‌ ప్రభుత్వం దళితుల హక్కులకు దిక్కులేకుండా చేసిందని అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడు, జవహర్‌, పీతల సుజాత, కాల్వ శ్రీనివాసులు, అమరనాథ్‌రెడ్డి, ఆదిరెడ్డి భవానీ, బీటీ నాయుడు, తెనాలి శ్రావణ్‌కుమార్‌, వర్ల రామయ్య, గూడూరి ఎరిక్సన్‌ బాబు తదితరులు ఆదివారం ట్విటర్‌ వేదికగా జగన్‌ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 

Updated Date - 2020-05-18T10:16:10+05:30 IST