తుఫాన్ బాధితులకు అండగా ఉండండి: చంద్రబాబు పిలుపు

ABN , First Publish Date - 2020-11-27T02:10:35+05:30 IST

నివర్ తుఫానుతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు అందుబాటులో ఉండాలని

తుఫాన్ బాధితులకు అండగా ఉండండి: చంద్రబాబు పిలుపు

అమరావతి: నివర్ తుఫానుతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు అందుబాటులో ఉండాలని టీడీపీ కార్యకర్తలకు, నేతలకు పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు, చిత్తూరు జిల్లాల టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. ‘నెల్లూరు, చిత్తూరు జిల్లాలపై నివర్ తుపాను తీవ్ర ప్రభావం. అనేక గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. విపత్తులో బాధితులను ఆదుకోవడం మనందరి బాధ్యత. బాధిత ప్రజానీకాన్ని అన్నివిధాలా ఆదుకోవాలి. టీడీపీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పర్యటించాలి. ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఎక్కడికక్కడ సహాయక చర్యలు చేపట్టాలి’ అని చంద్రబాబు కోరారు.

Updated Date - 2020-11-27T02:10:35+05:30 IST