-
-
Home » Andhra Pradesh » tdp chandrababu
-
సీఎం సహాయ నిధికి చంద్రబాబు విరాళం
ABN , First Publish Date - 2020-03-25T01:33:11+05:30 IST
సీఎం సహాయ నిధికి చంద్రబాబు విరాళం

అమరావతి: కరోనా నివారణకు సీఎం సహాయ నిధికి టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు రూ.10లక్షల విరాళం అందజేశారు. రూ.10 లక్షల వ్యక్తిగత విరాళంతో పాటు..ఎమ్మెల్యేల నెల వేతనాన్ని సీఎం సహాయనిధికి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనాను ఎదుర్కొనేందుకు అంతా ఐక్యంగా పనిచేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. విపత్కర పరిస్థితుల్లో తోచినవిధంగా ప్రజలు సాయం చేయాలని సూచించారు.