ఉన్న రిజర్వేషనూ గుటకాయ స్వాహా
ABN , First Publish Date - 2020-03-08T10:54:22+05:30 IST
ఉన్న రిజర్వేషనూ గుటకాయ స్వాహా

నోటికాడ కూడు లాక్కొన్న దొంగబ్బాయి: అయ్యన్న, జవహర్ ఆగ్రహం
అమరావతి, మార్చి 7(ఆంధ్రజ్యోతి): ‘నేను విన్నాను నేను ఉన్నాను అన్నాడు. వచ్చి పేదల ముద్ద లాక్కున్నాడు. కొత్తవి ఎలాగూ ఇవ్వడు. మన ప్రబుద్ధుడు బీసీలకున్న 34ు రిజర్వేషన్‌ను కూడా గుటకాయ స్వాహా చేశాడు. మళ్లీ లేనిపోని ముద్దుల ప్రేమ చూపిస్తాడు’... అంటూ సీఎం జగన్‌పై టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. బీసీల రిజర్వేషన్లను కాలరాసి ఎన్నికలకు వెళ్తున్న జగన్ వేసే భిక్షకు బీసీలు ఎదురుచూడడం లేదని మాజీమంత్రి జవహర్ అన్నారు. సీఎం తీరును మరో నాయకుడు ద్వారపురెడ్డి జగదీష్ తప్పుబట్టారు.