జిప్పు లాగే మంత్రిగా మిగిలిపోయారు
ABN , First Publish Date - 2020-07-08T08:22:57+05:30 IST
నీటి పారుదల వ్యవహారాలు చూడమని బాధ్యత అప్పగిస్తే అనిల్ కుమార్ చివరకు జిప్పు లాగే మంత్రిగా మిగిలిపోయారని టీడీపీ ఎద్దేవా చేసింది.
- అనిల్ కుమార్‌ను ఎద్దేవా చేసిన టీడీపీ
అమరావతి, జూలై 7(ఆంధ్రజ్యోతి): నీటి పారుదల వ్యవహారాలు చూడమని బాధ్యత అప్పగిస్తే అనిల్ కుమార్ చివరకు జిప్పు లాగే మంత్రిగా మిగిలిపోయారని టీడీపీ ఎద్దేవా చేసింది. ‘‘మేం ప్రజా సమస్యలపై చర్చ కోసం శాసన మండలికి వెళ్తే ఆయన అక్కడకు వచ్చి ఫ్యాంట్ జిప్పులాగి అసభ్యంగా ప్రవర్తించారు. మేం, ఆయన పరువు కాపాడాలని ఒక మంత్రి ఇలా చేశారని మాత్రమే చెప్పాం. కానీ ఆయన ప్రతి రోజూ తనకు తనే ‘నేను జిప్పు లాగలేదు’ అని చెప్పుకొంటున్నారు’’ అని టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి అన్నారు. ఆయన శాఖలో నీటి పారుదల కన్నా నోటి పారుదలే ఎక్కువగా కనిపిస్తోంది. ‘ఆన్‌లైన్ బెట్టింగ్ కింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్’ అని గూగుల్ చేస్తే ఆయన పేరే వస్తోంది’’ అని దీపక్ రెడ్డి విమర్శించారు. తుంగభద్ర నదిపై కర్ణాటక ప్రభుత్వం మరో డ్యాం నిర్మాణానికి అనుమతులు ఇచ్చేసింది. అది పూర్తయితే సీమలోని రైతులు మట్టి కొట్టుకుపోతారని ఆందోళన వ్యక్తం చేశారు.