-
-
Home » Andhra Pradesh » Taxes on everything except air Lokesh
-
గాలిపై తప్ప అన్నింటిపైనా పన్నులు: లోకేశ్
ABN , First Publish Date - 2020-12-27T07:29:16+05:30 IST
‘‘ఒక్క చాన్స్ ఇస్తే.. ఇరగదీస్తానని.. అధికారంలోకి వచ్చాక ప్రజల్ని నిలపెట్టి ‘బాధే’స్తున్నాడు’’ అని సీఎం జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ధ్వజమెత్తారు.

అమరావతి, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): ‘‘ఒక్క చాన్స్ ఇస్తే.. ఇరగదీస్తానని.. అధికారంలోకి వచ్చాక ప్రజల్ని నిలపెట్టి ‘బాధే’స్తున్నాడు’’ అని సీఎం జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ధ్వజమెత్తారు. పక్క రాష్ట్రంలోని పెట్రోలు బంకుల్లో.. ‘ఏపీలో కంటే పెట్రోల్ రూ.2.80, డీజిల్ రూ.3 తక్కువ’ అని బోర్డులు పెట్టారంటే సామాన్యుడిపై జగన్‌రెడ్డి బాదుడు ఏ రేంజ్‌లో ఉందో అర్ధం చేసుకోవచ్చన్నారు.
‘‘ఒక్క గాలి తప్ప అన్నిటిపైనా పన్నులు పెంచిన జగన్‌రెడ్డి ప్రజల రక్తాన్ని జలగలా జుర్రేస్తున్నాడు’’ అని ట్విటర్‌లో మండిపడ్డారు. కాగా, ‘‘జగన్‌రెడ్డికి ఊరికో ప్యాలెస్ కావాలి. పేదవాడికి వైఎస్ రేకుల షెడ్డు పథకమా?’’ అని మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. ‘అప్పులివ్వలేదని బ్యాంకుల ముందు మీరు చెత్తపోయించిన రీతిలోనే, తాడేపల్లి ప్యాలెస్ ముందు ప్రజలందరూ చెత్త పోస్తే ఏం చేస్తారు?’ అని విజయసాయిరెడ్డిని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న నిలదీశారు.