తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

ABN , First Publish Date - 2020-12-27T14:44:58+05:30 IST

తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.

తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

అనంతపురం జిల్లా: తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. పెద్దారెడ్డి ఇద్దరు కుమారులపై కూడా కేసు నమోదయింది. న్యాయవాది శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి డ్రైవర్ సుబ్బరాయుడును కులం పేరుతో దూషించడంతో పాటు బెదిరించారంటూ కేసు నమోదు చేశారు. అలాగే కంప్యూటర్ ఆపరేటర్ దాసరి కిరణ్‌పై దాడి ఘటనలో పెద్దారెడ్డితో పాటు అతని అనుచరులపై కేసు నమోదైంది. జేసీ ఇంటిపై రాళ్ల దాడికి పాల్పడ్డారంటూ పెద్దారెడ్డి ఇద్దరు కుమారులపై తాడిపత్రి పోలీసులు మరో కేసు నమోదు చేశారు. 

Updated Date - 2020-12-27T14:44:58+05:30 IST