మే 5 నాటికి దేశంలో కరోనా నియంత్రణ

ABN , First Publish Date - 2020-04-18T10:49:10+05:30 IST

మే 5 నాటికి దేశంలో కరోనా వైరస్‌ నియంత్రణ సాధ్యం అవుతుందని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు.

మే 5 నాటికి దేశంలో కరోనా నియంత్రణ

శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి


పెందుర్తి (విశాఖపట్నం), ఏప్రిల్‌ 17: మే 5 నాటికి దేశంలో కరోనా వైరస్‌ నియంత్రణ సాధ్యం అవుతుందని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. విశాఖపట్నంలోని శారదా పీఠంలో శుక్రవారం పీఠాధిపతి ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచానికే గురు స్థానంలో ఉన్న భారతదేశంలో గ్రహ కూటమి మార్పు, కిరణాల ప్రసరణతో వచ్చే నెలలో వైరస్‌ తిరోగమనం పడుతుందని స్వరూపానంద పేర్కొన్నారు. ప్ర పంచాన్ని కాలసర్ప దోషం వెంటాడుతున్నదని, గ్రహ ప్రతికూల పరిస్థితుల ప్రభావం వల్లనే కరోనా నియంత్రణ కాలేదన్నారు. ఏప్రిల్‌ 24 నుంచి దుష్ట గ్రహాల సంచార ప్రభావం తగ్గుతుందని, దాంతో మే 5 నాటికి పరిస్థితి అదుపులోకి రానుందని చెప్పారు. 

Updated Date - 2020-04-18T10:49:10+05:30 IST