కోనసీమ తిరుపతి వాడపల్లి ఆలయ ఈవోపై సస్పెన్షన్ వేటు
ABN , First Publish Date - 2020-05-11T17:40:50+05:30 IST
కోనసీమ తిరుపతి వాడపల్లి ఆలయ ఈవోపై సస్పెన్షన్ వేటు
రాజమండ్రి: లాక్‌డౌన్ నిబంధనలకు వ్యతిరేకంగా సిఫార్సులతో భక్తులకు దర్శనం చేయించిన కోనసీమ తిరుపతి వాడపల్లి ఆలయ ఈవో సత్యనారాయణరాజుపై సస్పెన్షన్ వేటు పడింది. సత్యనారాయణతో పాటు ఎనిమిది మందిని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. సస్పెన్షన్‌కు గురైన వాడపల్లి ఆలయ ఈవో సహా సిబ్బందిపై ఆత్రేయపురం పోలీసులు కేసులు నమోదు చేశారు. సత్యనారాయణరాజు సస్పెన్షన్‌తో వాడపల్లి దేవస్థానం బాధ్యతలను మందపల్లి ఆలయ ఈవో సింగం రాధకు అప్పగిస్తూ దేవదాయ శాఖ కమీషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.