‘సస్పెన్షన్‌ ఉపసంహరించుకోకుంటే ఉద్యమం’

ABN , First Publish Date - 2020-11-13T09:38:33+05:30 IST

‘‘అకారణంగా, వివరణ తీసుకోకుండా ఏకపక్షంగా... ఇంజనీర్‌ను సస్పెండ్‌ చేయడం సరికాదు. వెంటనే సస్పెన్షన్‌ను ఉపసంహరించుకోవాలి.

‘సస్పెన్షన్‌ ఉపసంహరించుకోకుంటే ఉద్యమం’

అమరావతి, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): ‘‘అకారణంగా, వివరణ తీసుకోకుండా ఏకపక్షంగా... ఇంజనీర్‌ను సస్పెండ్‌ చేయడం సరికాదు. వెంటనే సస్పెన్షన్‌ను ఉపసంహరించుకోవాలి. లేకపోతే మరోసారి ఉద్యమం చేపడతాం’’ అని పంచాయతీరాజ్‌ డిప్లమో ఇంజనీర్ల సంఘం హెచ్చరించింది. సంఘం చైర్మన్‌ సీహెచ్‌ హనుమంతరావు గురువారం మీడియాతో మాట్లాడారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల భవనాల నిర్మాణ పునుల్లో పురోగతి మందగించిందంటూ అనంతపురం జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు, గుదిబండ మండల ఇంజనీర్‌ వెంకటనారాయణను సస్పెండ్‌ చేయడం సీసీఏ నిబంధనలకు విరుద్ధమన్నారు. 

Updated Date - 2020-11-13T09:38:33+05:30 IST