ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టులో విచారణ
ABN , First Publish Date - 2020-11-26T17:51:14+05:30 IST
ఢిల్లీ: ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

ఢిల్లీ: ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సస్పెన్షన్ ఎత్తేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఏపీ ప్రభుత్వం సవాల్ చేసింది. జస్టిస్ ఏఎం ఖాన్ విల్కర్, జస్టిస్ అజయ్ రోస్తగి ధర్మాసనం ఆధ్వర్యంలో విచారణ జరిగింది. ఏపీ హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. తదుపరి ఆదేశాల వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని సుప్రీంకోర్టు వెల్లడించింది. 3 వారాల్లో సమాధానం ఇవ్వాలని ఏబీ వెంకటేశ్వరరావుకు నోటీసులు జారీ చేసింది. ఛార్జిషీట్‌ను వెంకటేశ్వరరావుకు సమర్పించాలని ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచన చేసింది.