కరోనా బాధిత ఉద్యోగులను ఆదుకోండి: పవన్
ABN , First Publish Date - 2020-07-19T08:42:29+05:30 IST
కరోనాపై పోరులో బలైన ఉద్యోగుల కుటుంబాలను ప్రభుత్వాలు ఆదుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన

అమరావతి, జూలై 18(ఆంధ్రజ్యోతి): కరోనాపై పోరులో బలైన ఉద్యోగుల కుటుంబాలను ప్రభుత్వాలు ఆదుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. పరిహారంగా రూ.కోటి ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి తక్షణమే ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కొవిడ్ నుంచి కోలుకొన్న వారికి విశ్రాంతి నిమిత్తం 4 వారాలు వేతన సెలవును ఇవ్వాలన్నారు.