-
-
Home » Andhra Pradesh » Sunkara Padmasri comments on Jagan
-
జగన్ వ్యక్తిగత స్వార్ధం కోసం ఏపీని నాశనం చేస్తున్నారు: సుంకర పద్మశ్రీ
ABN , First Publish Date - 2020-10-07T18:46:51+05:30 IST
విజయవాడ: అమరావతి మహిళా జేఏసీ నేతలు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు.

విజయవాడ: అమరావతి మహిళా జేఏసీ నేతలు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. ఏపీ రాజధానిగా అమరావతినే ఉంచాలని మహిళా జేఏసీ నేతలు వినతిపత్రం సమర్పించారు. జగన్ వ్యక్తిగత స్వార్ధం కోసం ఏపీని నాశనం చేస్తున్నారని సుంకర పద్మశ్రీ విమర్శించారు. అమరావతి రాజధానికి అన్ని పార్టీలు మద్దతు పలికాయన్నారు. కేంద్రం సరైన సమయంలో సానుకూలంగా స్పందిస్తుందని నిర్మల చెప్పారు. సీఎం జగన్ ఇప్పటికైనా అమరావతిపై తన తీరు మార్చుకోవాలని పద్మశ్రీ సూచించారు.