107 మంది రైతులు చనిపోతే ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదు: సుంకర పద్మశ్రీ
ABN , First Publish Date - 2020-12-03T19:35:24+05:30 IST
అమరావతి: ఉద్యమంలో చనిపోయిన రైతు కుటుంబాలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం హేయమైన చర్య అని అమరావతి

అమరావతి: ఉద్యమంలో చనిపోయిన రైతు కుటుంబాలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం హేయమైన చర్య అని అమరావతి జేఏసీ మహిళా నేత సుంకర పద్మశ్రీ పేర్కొన్నారు. 107 మంది రైతులు చనిపోతే ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదన్నారు. ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. అమరావతి మాత్రమే ఏపీకి రాజధానిగా కొనసాగాలన్నారు. రాజధాని తరలిస్తే సీఎం జగన్‌కి పుట్టగతులుండవని సుంకర పద్మశ్రీ పేర్కొన్నారు.