నిమ్మగడ్డ అనవసరంగా హడావుడి చేశారు: సుందరరామ శర్మ

ABN , First Publish Date - 2020-06-23T13:59:55+05:30 IST

కోర్టు తీర్పు తర్వాత నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ అనవసరంగా హడావుడి చేశారని ఏపీ కాంగ్రెస్‌ నేత సుందరరామ శర్మ అన్నారు. ఏబీఎన్‌ చర్చావేదికలో ఆయన

నిమ్మగడ్డ అనవసరంగా హడావుడి చేశారు: సుందరరామ శర్మ

విజయవాడ: కోర్టు తీర్పు తర్వాత నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ అనవసరంగా హడావుడి చేశారని ఏపీ కాంగ్రెస్‌ నేత సుందరరామ శర్మ అన్నారు. ఏబీఎన్‌ చర్చావేదికలో ఆయన మాట్లాడారు. తీర్పు అనుకూలంగా వచ్చాక నిమ్మగడ్డ కొంత సంయమనం పాటించాల్సిందని అభిప్రాయపడ్డారు. ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత మాత్రమే ఎస్‌ఈసీది అయితే.. కరోనాపై ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే ఎందుకు ఎన్నికలు వాయిదా వేశారని సుందరరామ శర్మ ప్రశ్నించారు.

Read more