విషాదం: పూజారి దంపతుల ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-05-29T17:13:58+05:30 IST
జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జలదంకి మండలం బ్రాహ్మణక్రాకలో అనారోగ్య సమస్యలతో పూజారి దంపతులు ఆత్మహత్య

నెల్లూరు: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జలదంకి మండలం బ్రాహ్మణక్రాకలో అనారోగ్య సమస్యలతో పూజారి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. స్థానిక వేణుగోపాల స్వామి గుడిలో ఉన్న బావిలోకి దూకి దంపతులు ప్రాణాలు తీసుకున్నారు. దీంతో బ్రాహ్మణక్రాక గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.