విషాదం: పోలీసులు కేసు పట్టించుకోలేదని వ్యక్తి ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-07-10T20:44:08+05:30 IST
ఎర్రగుంట్ల శాంతినగర్లో విషాదం చోటుచేసుకుంది. ఓబులేసు అనే వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తీవ్రంగా కొట్టడంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని

కడప: ఎర్రగుంట్ల శాంతినగర్లో విషాదం చోటుచేసుకుంది. ఓబులేసు అనే వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తీవ్రంగా కొట్టడంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. వారం క్రితం కూతురు కులాంతర వివాహం చేసుకుని వెళ్లిపోయిందని ఓబులేసు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్టేషన్ బయట వాహనరాకపోకలు అడ్డుకున్నాడని ఓబులేసుపైనే పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు విషయంపై ప్రతిరోజు స్టేషన్కు పిలిచి హింసిస్తున్నారన్న మనస్తాపంతో తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని భార్య దానమ్మ ఆరోపించింది. కూతురు కులాంతర వివాహం చేసుకోవడంతోనే ఒబులేష్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.