సుభాష్ చంద్రబోస్, మోపిదేవి రాజీనామాలు ఆమోదం

ABN , First Publish Date - 2020-07-21T00:43:36+05:30 IST

సుభాష్ చంద్రబోస్, మోపిదేవి రాజీనామాలు ఆమోదం

సుభాష్ చంద్రబోస్, మోపిదేవి రాజీనామాలు ఆమోదం

అమరావతి: డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకటరమణల రాజీనామాలను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదించారు. మంత్రి వర్గ విస్తరణ వరకు ఆ పోర్టు ఫోలియోలు సీఎం జగన్ వద్ద ఉంటాయని తెలుపుతూ గవర్నర్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. అంతకుముందు ఎమ్మెల్సీ పదవికి మంత్రి మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. శాసన మండలి కార్యదర్శి బాలకృష్ణమాచార్యులకు రాజీనామా లేఖను మంత్రి మోపిదేవి పంపించారు. తన వ్యక్తిగత కార్యదర్శి ద్వారా రాజీనామా లేఖను మండలి కార్యదర్శికి పంపినట్లు మోపిదేవి తెలిపారు. పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి ఎమ్మెల్సీల రాజీనామాలకు ఆమోదం తెలిపారు.  సుభాష్ చంద్రబోస్, మోపిదేవి గత సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయారు. ఎన్నికలకు ముందు సీఎం జగన్ ఇచ్చిన హామీలో భాగంగా ఇద్దరిని ఎమ్మెల్సీలుగా ఎన్నుకుని మంత్రి పదవులిచ్చారు. ఇటీవల సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ రాజ్యసభకు ఎన్నికయ్యారు. అధికారికంగా ప్రమాణం చేయకపోయినా రాజ్యసభ సభ్యులుగా వారి పదవీకాలం మొదలైంది.

Updated Date - 2020-07-21T00:43:36+05:30 IST