పరీక్షలు లేకుండానే పైతరగతులకు

ABN , First Publish Date - 2020-03-27T09:05:32+05:30 IST

కరోనా కారణంగా పాఠశాలలన్నీ మూసేసిన నేపథ్యంలో 6 నుంచి 9 తరగతుల వరకూ చదువుతున్న విద్యార్థులకు వార్షిక పరీక్షలు లేకపోయినా నేరుగా...

పరీక్షలు లేకుండానే పైతరగతులకు

  • 6 నుంచి 9 వరకూ వార్షిక పరీక్షలు రద్దు చేసిన ప్రభుత్వం

అమరావతి, మార్చి 26(ఆంధ్రజ్యోతి): కరోనా కారణంగా పాఠశాలలన్నీ మూసేసిన నేపథ్యంలో 6 నుంచి 9 తరగతుల వరకూ చదువుతున్న విద్యార్థులకు వార్షిక పరీక్షలు లేకపోయినా నేరుగా పైతరగతులకు ప్రమోట్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గురువారం సీఎం జగన్‌ విద్యాశాఖపై సమీక్షించారు. కరోనా వైరస్‌ వల్ల ఇతర రాష్ర్టాల్లో పరీక్షలు రాయకుండానే 6 నుంచి 9 తరగతుల పిల్లలను పైతరగతులకు పంపుతున్నారనే విషయాన్ని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. దీంతో రాష్ట్రంలోనూ అదే విధానం అమలుచేయాలని సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-27T09:05:32+05:30 IST