సిట్ విచారణపై స్టే విధించిన హైకోర్టు
ABN , First Publish Date - 2020-09-16T17:27:23+05:30 IST
గత ప్రభుత్వ నిర్ణయాలన్నీంటిని పునఃసమీక్షించాలంటూ..

అమరావతి: గత ప్రభుత్వ నిర్ణయాలన్నీంటిని పునఃసమీక్షించాలంటూ వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) విచారణపై హై కోర్టు స్టే విధించింది. టీడీపీ నేతలు ఆలపాటి రాజ, వర్ల రామయ్యలు వేసిన పిటిషన్లను విచారించిన న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది.
రఘురామ్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన సిట్‌కు ప్రభుత్వం ప్రత్యేక అధికారాలు కట్టబెట్టింది. పోలీస్ స్టేషన్‌కు ఉన్నటువంటి అధికారాలను సిట్‌కు ఇవ్వడం న్యాయబద్దం కాదని, ఈ సిట్‌ను తక్షణం నిలుపుదల చేయాలని టీడీపీ నేతలు ఆలపాటి రాజ, వర్ల రామయ్యలు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై బుధవారం విచారణ జరిపిన న్యాయస్థానం ఇరువైపుల వాదనలు విన్న అనంతరం సిట్‌పై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.