దిక్కుతోచని స్థితిలో ప్రతిమల తయారీ కుటుంబాలు

ABN , First Publish Date - 2020-06-23T21:24:26+05:30 IST

ఆయన విఘ్నాలను తొలగించే దైవం. ఆయనే విఘ్నేశ్వరుడు.

దిక్కుతోచని స్థితిలో ప్రతిమల తయారీ కుటుంబాలు

తిరుపతి: ఆయన విఘ్నాలను తొలగించే దైవం. ఆయనే విఘ్నేశ్వరుడు. ఆయన రూపాన్ని మూడు తరాలుగా ప్రజలకు అందించే వందలాది కుటుంబాలు తిరుపతిలోని ఓ కాలనీలో ప్రత్యేకంగా నివశిస్తున్నాయి. వారికి ఏడాది పొడవున వినాయక ప్రతిమలు తయారు చేయడమే వృత్తి. కుటుంబం మొత్తం కష్టపడి విగ్రహాలు తయారు చేస్తుంటారు. అలాంటి కుటుంబాలు కరోనాతో వినాయక చవితి  జరుగుతుందా? లేదా? తెలియక ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. ఇప్పటికే తమకు అడ్వాన్సులు వచ్చేవని, కానీ ఇంతవరకు ఎవరూ ప్రతిమలు కావాలని ఫోన్లు చేయలేదని, పాత కస్టమర్లకు తాము ఫోన్ చేస్తే విగ్రహాలు వద్దని చెబుతున్నారని వారు వాపోతున్నారు. తమ పరిస్థితి అర్థం కావడంలేదని చెబుతున్నారు. 

Read more