మండపేటలో క్రీస్తు, మేరీమాత విగ్రహాలు ధ్వంసం

ABN , First Publish Date - 2020-09-24T07:43:03+05:30 IST

తూర్పుగోదావరి జిల్లా మండపేట మెయిన్‌రోడ్డును అనుకుని ఉన్న రోమన్‌ కేథలిక్‌ చర్చి గేటువద్ద ఉన్న యేసుక్రీస్తు, మేరీమాత

మండపేటలో క్రీస్తు, మేరీమాత విగ్రహాలు ధ్వంసం

మండపేట, సెప్టెంబరు 23: తూర్పుగోదావరి జిల్లా మండపేట మెయిన్‌రోడ్డును అనుకుని ఉన్న రోమన్‌ కేథలిక్‌ చర్చి గేటువద్ద ఉన్న యేసుక్రీస్తు, మేరీమాత విగ్రహాలను మంగళవారం అర్థరాత్రి దుండగులు ధ్వంసం చేశారు. బుధవారం చర్చికి వచ్చిన భక్తులు విగ్రహాల ముఖం, చేతులు ధ్వంసమై ఉండడాన్ని గమనించి చర్చి ఫాదర్‌కు తెలపడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ధ్వంసమైన విగ్రహాల స్థానంలో గౌరీపట్నం నుంచి తీసుకువచ్చిన విగ్రహాలను ఏర్పాటు చేశారు. రాజమహేంద్రవరం అర్బన్‌ ఎస్పీ షిమోషీ బాజ్‌పాయ్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. 


Updated Date - 2020-09-24T07:43:03+05:30 IST