-
-
Home » Andhra Pradesh » State situation is dire Purandeshwari
-
రాష్ట్ర పరిస్థితి దారుణం: పురందేశ్వరి
ABN , First Publish Date - 2020-12-27T07:37:04+05:30 IST
రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ఎవరూ ముందుకురావడం లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు.

విశాఖపట్నం, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ఎవరూ ముందుకురావడం లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. విశాఖ బీజేపీ కార్యాలయంలో శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రానున్న కేంద్ర బడ్జెట్ కోసం సలహాలు తీసుకునేందుకు పారిశ్రామికవేత్తలతో తాను భేటీ అయినట్టు తెలిపారు. ఈ సందర్భంగా వారు రాష్ట్రంలో పరిస్థితులపై, కక్షపూరిత రాజకీయాలపై ఆందోళన వ్యక్తం చేశారని చెప్పారు.