ఢిల్లీలో బుగ్గన ఎదురుచూపులు

ABN , First Publish Date - 2020-11-25T08:37:29+05:30 IST

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పెరిగిన తాజా అంచనా వ్యయంపై కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో చర్చించడానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి రెండ్రోజులుగా ఢిల్లీలో నిరీక్షిస్తున్నారు. సోమవారమే ఆయన ఢిల్లీ వచ్చినా షెకావత్‌ అందుబాటులో లేరు. బుగ్గనతోపాటు రాష్ట్ర జలవనరుల

ఢిల్లీలో బుగ్గన ఎదురుచూపులు

పోలవరంపై చర్చించేందుకు హస్తినకు 

జలశక్తి మంత్రితో భేటీకి

2 రోజులుగా ఆర్థిక మంత్రి నిరీక్షణ

అందుబాటులో లేని షెకావత్‌

సమయమిస్తే నేడు కలిసే చాన్స్‌?

జలశక్తి మంత్రితో భేటీకి బుగ్గన నిరీక్షణన్యూఢిల్లీ, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పెరిగిన తాజా అంచనా వ్యయంపై కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో చర్చించడానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి రెండ్రోజులుగా ఢిల్లీలో నిరీక్షిస్తున్నారు. సోమవారమే ఆయన ఢిల్లీ వచ్చినా షెకావత్‌ అందుబాటులో లేరు. బుగ్గనతోపాటు రాష్ట్ర జలవనరుల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ తదితరులు కూడా ఇక్కడకు వచ్చారు. పోలవరం ప్రాజెక్టు పూర్త్తికావడానికి రూ.47,725 కోట్ల తుది అంచనా వ్యయానికి పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ఆమోదం తె లుపుతూ కేంద్రానికి సిఫారసు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై కేంద్ర మంత్రి షెకావత్‌కు వివరించి.. తాజా అంచనాలకు ఆయన్ను ఒప్పించే ఉద్దేశంతో బుగ్గన వచ్చారు. నీతి ఆయోగ్‌, కేంద్ర ఆర్థిక శాఖ అధికారులను కూడా కలిసే ప్రయత్నం చేస్తున్నారు. బుధవారం జలశక్తి మంత్రి సమయం ఇస్తే.. సమావేశమయ్యే అవకాశముందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

Read more