జేఈఈ మెయిన్స్‌ పేపర్‌-1 ప్రారంభం

ABN , First Publish Date - 2020-09-03T08:09:42+05:30 IST

జేఈఈ మెయిన్స్‌ పేపర్‌-1 పరీక్షలు దేశవ్యాప్తంగా బుధవారం ప్రారంభమయ్యాయి.

జేఈఈ మెయిన్స్‌  పేపర్‌-1 ప్రారంభం

అమరావతి, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): జేఈఈ మెయిన్స్‌ పేపర్‌-1 పరీక్షలు దేశవ్యాప్తంగా బుధవారం ప్రారంభమయ్యాయి. షిఫ్ట్‌-1, షిఫ్ట్‌-2లలో అడిగిన ప్రశ్నలు సుదీర్ఘంగా ఉండటంతో సమయం సరిపోలేదని పలువురు అభ్యర్థులు వాపోయారు. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజన్సీ రెండు విడతల్లో నిర్వహించిన బీఈ/బీటెక్‌ పరీక్షలకు 7,46,115మంది రిజిస్టర్‌ కాగా బుధవారం దేశవ్యాప్తంగా దాదాపు 85వేల మంది హాజరైనట్లు సమాచారం.


ఇందులో రాష్ట్ర విద్యార్థులు 15వేల మంది వరకు ఉంటారని అంచనా. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మాథ్స్‌ ప్రశ్నల సరళిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సులభంగా ఉన్నాయని కొందరు, మధ్యస్థంగా ఉన్నాయని మరికొందరు, కఠినంగా ఉన్నాయని ఇంకొందరు విశ్లేషించారు. 


Updated Date - 2020-09-03T08:09:42+05:30 IST