-
-
Home » Andhra Pradesh » Stadirin threat
-
వీడని స్టైరిన్ ముప్పు
ABN , First Publish Date - 2020-05-13T09:41:29+05:30 IST
ఎల్జీ పాలిమర్స్ నుంచి వెలువడిన విషవాయువు స్టైరిన్ ముప్పు ఇంకా తొలగినట్టు కనిపించడంలేదు.

సొమ్మసిల్లిన ఇద్దరు వలంటీర్లు
ఇళ్ల నుంచి ఘాటైన వాసన
గోపాలపట్నం(విశాఖపట్నం), మే 12: ఎల్జీ పాలిమర్స్ నుంచి వెలువడిన విషవాయువు స్టైరిన్ ముప్పు ఇంకా తొలగినట్టు కనిపించడంలేదు. వెంకటాపురం గ్రామస్థులు ఇళ్లకు తిరిగి వచ్చి తలుపులు తీయగానే ఘాటైన వాసన వస్తోంది. మంగళవారం బాధితుల వివరాల సేకరణకు వచ్చిన వలంటీర్లు కుసుమ, నూకరత్నం ఆ వాసనకు సొమ్మసిల్ల్లి పడిపోయారు. సమీప గ్రామ సచివాలయం వద్ద ఉన్న ఆశ వర్కర్లు వెంటనే అక్కడికి వచ్చి వారికి సపర్యలు చేశారు. అనంతరం గోపాలపట్నం ఆస్పత్రికి తరలించారు. వీరిని ఆస్పత్రికి తీసుకెళ్లిన ఆశ కార్యకర్త కనకమహాలక్ష్మి విషవాయువు ప్రభావంతో ఆస్పత్రిలోనే కుప్పకూలిపోయారు.