నేటితో ముగియనున్న శ్రీవారి వసంతోత్సవాలు

ABN , First Publish Date - 2020-04-07T12:56:47+05:30 IST

తిరుపతి: మూడు రోజులుగా జరుగుతున్న శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు నేటితో ముగియనున్నాయి.

నేటితో ముగియనున్న శ్రీవారి వసంతోత్సవాలు

తిరుపతి: మూడు రోజులుగా జరుగుతున్న శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఈ సందర్భంగా నేడు మలయప్ప స్వామివారికి, శ్రీరాములవారికి, శ్రీకృష్ణుడికి స్నపన తిరుమంజసం కార్యక్రమాన్ని ఆలయ అర్బకులు నిర్వహించనున్నారు. రేపు కల్యాణోత్సవం సేవను అర్చకులు ఏకాంతంగా నిర్వహించనున్నారు. ప్రస్తుతం శ్రీవారికి ఏకాంతంగానే టీటీడీ పూజా కైంకర్యాలు నిర్వహిస్తోంది. కాగా.. లాక్‌డౌన్ మరికొద్ది రోజులు కొనసాగనున్న నేపథ్యంలో శ్రీవారి దర్శనం భక్తులకు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది.

Read more