సింహవాహనంపై శ్రీవారి అభయం

ABN , First Publish Date - 2020-10-19T07:06:45+05:30 IST

నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం సింహవాహనంపై శ్రీనివాసుడు అభయహస్తంతో కటాక్షించారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయక

సింహవాహనంపై శ్రీవారి అభయం

తిరుమల, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం సింహవాహనంపై శ్రీనివాసుడు అభయహస్తంతో కటాక్షించారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో అలంకార భట్టాచార్యులు, అర్చకులు స్వామికి అభయ ఆహ్వాన నరసింహస్వామి అలంకారం చేశారు.

అనంతరం పక్కనే ఉన్న కల్యాణోత్సవ మండపానికి ఊరేగింపుగా తీసుకెళ్లి సింహవాహనంపై కొలువుదీర్చారు.   కాగా, రాత్రి మిలమిల మెరిసే ముత్యాల నడుమ ముత్యపుపందిరి వాహనంపై శ్రీవారు అధిష్ఠించారు. 


Updated Date - 2020-10-19T07:06:45+05:30 IST