శ్రీశైలం దేవస్థానంలో ఉద్యోగుల బదిలీ..

ABN , First Publish Date - 2020-12-28T00:52:40+05:30 IST

శ్రీశైలం దేవస్థానంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తొమ్మిది మంది ఉద్యోగులను బదిలీ చేస్తూ ఆలయ పాలక వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీశైలం గోశాల పర్యవేక్షకురాలు సాయికుమారిని ఆ పోస్ట్ నుంచి బదిలీ చేశారు.

శ్రీశైలం దేవస్థానంలో ఉద్యోగుల బదిలీ..

కర్నూలు: శ్రీశైలం దేవస్థానంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తొమ్మిది మంది ఉద్యోగులను బదిలీ చేస్తూ ఆలయ పాలక వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీశైలం గోశాల పర్యవేక్షకురాలు సాయికుమారిని ఆ పోస్ట్ నుంచి బదిలీ చేశారు. కాగా, గత కొద్ది రోజులుగా శ్రీశైలం గోశాలలో ఆవులు చనిపోతున్నాయంటూ సోషల్ మీడియాలో విపరీతమై ప్రచారం జరిగింది. గోవుల విషయంలో తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్.. శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. రజాక్, చక్రపాణి కలిసి శ్రీశైలం దేవస్థానంలో అక్రమాలకు పాల్పడుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఈ అంశంపై అటు రాజాసింగ్, ఇటు రజాక్, శిల్ప చక్రపాణి మధ్య మాటల యుద్ధం సాగింది. కాగా, ఈ ఆరోపణల పర్వం నేపథ్యంలో గోశాల ఉద్యోగుల బదిలీపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

Updated Date - 2020-12-28T00:52:40+05:30 IST