శ్రీశైలం జలాశయం ఐదు గేట్లు 10అడుగుల మేర ఎత్తివేత
ABN , First Publish Date - 2020-08-20T17:03:31+05:30 IST
శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి పెరిగింది. దీంతో అధికారుల జలాశయం ఐదుగు గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేశారు.

కర్నూలు: శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి పెరిగింది. దీంతో అధికారులు జలాశయం ఐదు గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేశారు. ఇన్ ఫ్లో 4,29,522 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 2,7,423 క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకు గాను...ప్రస్తుత నీటిమట్టం 883.30 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్ధ్యం 215.807 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 206.0996 టీఎంసీలుగా నమోదు అయ్యింది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.