శ్రీశైలం ప్రాజెక్ట్ 10గేట్లు 18అడుగుల మేర ఎత్తివేత
ABN , First Publish Date - 2020-08-22T14:03:11+05:30 IST
శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 10 గేట్లు 18 అడుగుల మేర ఎత్తివేశారు.
కర్నూలు: శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 10 గేట్లు 18 అడుగుల మేర ఎత్తివేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 4,03,201 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 4,60,250 క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకు గాను... ప్రస్తుత నీటిమట్టం 883.70 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 208.2841 టీఎంసీలుగా ఉంది. అటు కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.