కుడిగట్టు రక్షణ గోడ నిర్మించాలి: నిపుణుల కమిటీ

ABN , First Publish Date - 2020-03-08T11:04:49+05:30 IST

శ్రీశైలం ప్రాజెక్టు దిగువన కుడిగట్టు రక్షణ గోడ నిర్మాణం చేపట్టాల్సి ఉందని డ్యాం భద్రత నిపుణుల కమిటీ చైర్మన్‌ పాండ్యా తెలిపారు. భూగర్భ శాస్త్రవేత్తలచే ప్రొటెక్షన్‌ వాల్‌ పరిస్థితి తెలుసుకోవాల్సి ఉందని..

కుడిగట్టు రక్షణ గోడ నిర్మించాలి: నిపుణుల కమిటీ

శ్రీశైలం, మార్చి 7: శ్రీశైలం ప్రాజెక్టు దిగువన కుడిగట్టు రక్షణ గోడ నిర్మాణం చేపట్టాల్సి ఉందని డ్యాం భద్రత నిపుణుల కమిటీ చైర్మన్‌ పాండ్యా తెలిపారు. భూగర్భ శాస్త్రవేత్తలచే ప్రొటెక్షన్‌ వాల్‌ పరిస్థితి తెలుసుకోవాల్సి ఉందని.. క్రస్ట్‌గేట్లకు చిన్న చిన్న మరమ్మతులు చేయాలని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం డ్యాం భద్రతకు ఎలాంటి ఢోకా లేదని స్పష్టంచేశారు. మూడు రోజుల పాటు శ్రీశైలం డ్యాంను 9 మంది సభ్యులతో కూడిన బృందం పరిశీలించింది.. శనివారం అతిథిగృహంలో పాండ్యా బృందం మాట్లాడుతూ అనకట్ట నిర్మించి 50 సంవత్సరాలు పూర్తవడంతో కొన్ని మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.

Updated Date - 2020-03-08T11:04:49+05:30 IST